సీబీఐ దర్యాప్తుపై నమ్మకముంది | We have faith in CBI probe, says woman doctor parents | Sakshi
Sakshi News home page

సీబీఐ దర్యాప్తుపై నమ్మకముంది

Aug 24 2024 4:33 AM | Updated on Aug 24 2024 4:33 AM

We have faith in CBI probe, says woman doctor parents

ట్రెయినీ వైద్యురాలి తల్లిదండ్రుల వెల్లడి

బరాసత్‌(పశ్చిమబెంగాల్‌): కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో తమ కుమార్తెపై అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ చేపట్టిన విచారణపై  విశ్వాసముందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు.

 ‘ఈ ఘటన వెనుక ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు మాకున్న అనుమానం నిజమేనని తేలింది. ఈ నేరానికి కేవలం ఒక్కరు మాత్రమే కారణం కాదు’అని శుక్రవారం నార్త్‌ 24 పరగణాల జిల్లాలోని తమ నివాసంలో మీడియాతో వారన్నారు. ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జరిగే అక్రమాల గుట్టును బయటపెట్టాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement