పవన్‌ అన్నా.. కాపాడు అన్నా! | Marwadi Parents Display Placard At Pawan Meeting | Sakshi
Sakshi News home page

పవన్‌ అన్నా.. కాపాడు అన్నా!

Jun 26 2025 12:01 PM | Updated on Jun 26 2025 2:53 PM

Marwadi Parents Display Placard At Pawan Meeting

సాక్షి, తూర్పుగోదావరి: తమ బిడ్డ కనిపించడం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కనిపించేలా ఓ కుటుంబం ఫ్లకార్డులతో నిరసనకు దిగింది. పవన్‌ను కలిసేందుకు వచ్చిన మార్వాడి కుటుంబాన్ని ఆయన సిబ్బంది పట్టించుకోకుండా పంపేశారు.

కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం  మార్వాడి కుటుంబం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎయిర్‌ఫోర్ట్‌ నుంచి బయట పవన్ కళ్యాణ్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని బాధిత  కుటుంబం ఎదురుచూసింది. ఎయిర్‌ఫోర్ట్‌ వద్ద కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement