అమ్మా, నాన్న ఆనంద విహారం | Son Surprises Parents With Their First Trip Abroad To Singapore | Sakshi
Sakshi News home page

అమ్మా, నాన్న ఆనంద విహారం

Mar 10 2024 12:40 AM | Updated on Mar 10 2024 12:40 AM

Son Surprises Parents With Their First Trip Abroad To Singapore - Sakshi

వైరల్‌

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ వివేక్‌ వాఘ్‌ సర్‌ప్రైజ్‌ ట్రావెల్‌ ప్లాన్‌తో తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలకు గురి చేశాడు. ‘ఫ్లైయిట్‌లో మనం జైపూర్‌కు వెళుతున్నాం’  అని చెప్పి తల్లిదండ్రులను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లాడు. పాస్‌పోర్ట్‌లను వారి చేతికి అందిస్తూ  ఆఖరులో అసలు విషయం చెప్పాడు. తాము వెళుతున్నది జైపూర్‌ కాదని సింగపూర్‌కు అని తెలుసుకున్న వివేక్‌ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఇది వారికి తొలి అంతర్జాతీయ ప్రయాణం.

‘సీ దెయిర్‌ రియాక్షన్‌... సర్‌ప్రైజ్‌ ట్రిప్‌’ కాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియా యూజర్‌లు, సెలబ్రిటీలు ఈ వీడియోను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యాక్టర్‌ జై భానుశాలి ‘ప్రౌడ్‌ సన్‌. విషయం తెలిసిన తరువాత మీ తండ్రి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ నాకు ఎంతగానో నచ్చింది. మా అబ్బాయి మమ్మల్ని సింగపూర్‌ తీసుకువెళ్లాడు అని ఆయన గర్వంగా స్నేహితులతో చెప్పుకోవచ్చు’ అని కామెంట్‌ పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement