జీతం రూ.2 లక్షలు, ఇన్‌స్టా ద్వారా రూ.2 లక్షలు.. నేను జాబ్ మానేయొచ్చా? | Rs 1 Crore Investments Rs 2 Lakh Instagram Income:Should Quit My Job | Sakshi
Sakshi News home page

జీతం రూ.2 లక్షలు, ఇన్‌స్టా ద్వారా రూ.2 లక్షలు.. నేను జాబ్ మానేయొచ్చా?

Nov 8 2026 7:33 AM | Updated on Nov 8 2026 7:43 AM

Rs 1 Crore Investments Rs 2 Lakh Instagram Income:Should Quit My Job

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా.. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చాలామంది కంటెంట్ క్రియేటర్లు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న కెరీర్ సందిగ్ధత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నెలకు రూ. 2 లక్షల జీతం వచ్చే స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి, పూర్తిస్థాయిలో కంటెంట్ క్రియేషన్‌పైనే దృష్టి పెట్టాలా? లేక ఉద్యోగం చేస్తూనే కొనసాగించాలా? అనేదే ఆ వ్యక్తి ముందున్న ప్రశ్న.

బ్యాంక్ ఖాతాలో రూ.10 లక్షలు
ఆ వ్యక్తి ప్రస్తుతం నెలకు రూ. 2 లక్షల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నారు. మరోవైపు ఇన్‌స్టాలో 1.5 లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‏లో 52 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా నెలకు రూ. 2 లక్షలు, యూట్యూబ్ ద్వారా మరో రూ. 20 వేలు సంపాదిస్తున్నారు. అంటే.. ఉద్యోగంతో కలిపి నెలకు సుమారు రూ. 4.2 లక్షల ఆదాయం వస్తోందన్నమాట. అంతేకాకుండా రూ. 1 కోటికి పైగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉండగా, మరో రూ.10 లక్షలు బ్యాంక్ ఖాతాలో కూడా ఉన్నట్లు వెల్లడించారు.

అయితే.. ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో కంటెంట్ క్రియేషన్‌పై దృష్టి పెడితే మరింత సంపాదించగలనని ఆ వ్యక్తి భావిస్తున్నారు. కానీ.. స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకోవడం విషయంలోనే ఆలోచనలో పడ్డారు. ఈ విషయంపై రెడ్డిట్‌లో నెటిజన్ల సలహా కోరగా.. కొందరు ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాలని సూచించారు. మరికొందరు మాత్రం కంటెంట్ ద్వారా వచ్చే ఆదాయం కనీసం కొన్ని నెలల పాటు స్థిరంగా కొనసాగిన తర్వాతే ఉద్యోగాన్ని వదిలేయాలని అభిప్రాయపడ్డారు.

నెటిజన్ల సలహా
ఒక రెడ్డిట్‌ యూజర్ తనకు తెలిసిన వ్యక్తి నెలకు రూ. 25 లక్షల చొప్పున వరుసగా మూడు నెలలు కంటెంట్ క్రియేషన్ ద్వారా సంపాదించిన తర్వాతే తన రూ. 30 లక్షల వార్షిక జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేశారని తెలిపారు. కేవలం బ్రాండ్ డీల్స్‌పై ఆధారపడటం మంచిది కాదని, ఆదాయానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉండాలని సూచించారు. మరో వ్యక్తి మాత్రం కంటెంట్ క్రియేషన్‌ను పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకున్న తర్వాత కూడా అదే ఆసక్తితో పనిచేయగలమా?.. బ్రాండ్ ప్రమోషన్లు, డబ్బు కోసం మనకు నచ్చిన కంటెంట్‌ను మార్చుకోవాల్సి వస్తుందా? అనే విషయాలను కూడా ఆలోచించాలని చెప్పారు.

ఇదీ చదవండి: దీపావళి వేళ రైల్వే శాఖ కీలక హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement