breaking news
brand new car
-
సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్లో వీడియో హల్చల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్‌ఖాన్ సూపర్‌లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయని కొత్త బుల్లెట్ ప్రూఫ్ ‘నిస్సాన్ పెట్రోల్ ఎస్యూవీ’ని సల్మాన్ ఖాన్ అంతర్జాతీయ మార్కెట్‌నుంచి ప్రైవేట్‌గా దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ నిస్సాన్ అత్యంత ఖరీదైన ఎస్‌యూవీని సొంతం చేసుకున్న సల్లూ భాయ్. ఈ వారం ముంబైలో తన వ్యక్తిగత భద్రత , స్థానిక పోలీసులతో పా తన కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలను అనేక యూట్యూబ్ ఛానెల్‌లు షేర్ చేశాయి. సల్మాన్ ఖాన్ కనిపించిన నిస్సాన్ పెట్రోల్ స్టైలిష్ వైట్ కలర్లో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. ముందు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత భద్రత ఉన్న నల్లటి టయోటా ఫార్చ్యూనర్ ,వెనుక మహీంద్రా బొలెరో నియోలో పోలీసు అధికారులున్న వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అత్యంత ఖరీదైన నిస్సాన్ ఎస్యూవీ ఆగ్నేయాసియా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. వ్యక్తిగత భద్రత రీత్యా బుల్లెట్ఫ్రూఫింగ్కు ఉత్తమ ఎంపికగా పరిగణించబడే అత్యంత సురక్షితమైన కారు బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూని కొనుగోలు చేయడం విశేషం 5.6-లీటర్ వీ8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 405hp, 560Nm ని అందించే ఈ ఇంజీన్‌లో 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఉంది. సాధారణ కార్లలో కనిపించే వాటి కంటే మందంగా ఉండే కొత్త విండ్‌షీల్డ్‌తో పాటు మందపాటి క్లాడింగ్‌తో కూడిన విండో గ్లాసులను కూడా ఇందులో జోడించారు. కాగా సల్మాన్ ఖాన్ గ్యారేజీలో ఇది మొదటి బుల్లెట్ ప్రూఫ్ SUV కాదు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో అప్‌గ్రేడ్ చేశాడు. వీటితోపాటు, Range Rover Autobiography, Audi RS7, Mercedes AMG GLE 63 S , Mercedes BenzGL-Class కూడా సల్మాన్ ఖాన్ సొంతం -
ఫరా ఖాన్‌కు షారుక్ ఖాన్ ఖరీదైన కానుక
ముంబై: స్నేహితులను ఎలా సంతోషపెట్టాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు బాగా తెలుసు. ఖరీదైన కానుకలతో వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు. షారుక్ తన సన్నిహితురాలు, డైరక్టర్ ఫరా ఖాన్‌కు ఖరీదైన ఓ కొత్త బ్రాండ్ కారును కానుకగా ఇచ్చాడు. షారుక్ చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్'కు ఫరా దర్శకత్వం వహించింది. బహుమతిని అందుకున్న ఫరా సంతోషంతో షారుక్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. 'నేనందుకున్న బహుమతి ఏమిటో చూడండి! షారుక్‌కు ధన్యవాదాలు' అంటూ ఫరా ట్వీట్ చేసింది. కారుతో దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. షారుక్, ఫరా చాలా కాలంగా మంచి స్నేహితులు. ఫరాకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2004లో షారుక్ నటించిన'మై హూ నా', 2007లో 'ఓం శాంతి ఓం' చిత్రాలు విడుదలైన తర్వాత ఫరాకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో 'హ్యాపీ న్యూ ఇయర్'చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్ తదితరులు తారాగణం.