
ఒకప్పటిలా రొటీన్ కమర్షియల్ సినిమాలు అంటే అస్సలు సక్సెస్ కావట్లేదు. ఒకవేళ హిట్ అని డప్పుకొట్టినా సరే ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. దీంతో స్టార్ హీరోలు, యంగ్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రూట్ లో ఓ స్టార్ హీరో వెళ్తున్నట్లు అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో)
పైన ఫొటోలో శరత్ కుమార్ తో ఉన్నది సిద్ధార్థ్. అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సరైన హిట్స్ పడలేదు. తమిళంలోనూ చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ల క్రితం చిన్నా అనే మూవీతో అటు నటుడిగా మంచి పేరు వచ్చింది.
ఇప్పుడు మళ్లీ ఆ తరహాలోనే 3 BHK అనే మూవీ చేస్తున్నాడు. గతంలో చిన్నా చిత్రంలో కాస్త డీ గ్లామర్ గా కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ అలానే కనిపించబోతున్నాడు. ఇందులో శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మిడిల్ క్లాస్ కథతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈసారి కూడా సిద్ధార్థ్ హిట్ కొడతాడేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్)
