ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లే కావాలి! | Home buyers preferring 3BHK and above | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లే కావాలి!

Published Sat, Mar 15 2025 5:15 PM | Last Updated on Sat, Mar 15 2025 5:33 PM

Home buyers preferring 3BHK and above

ఇంటి డిజైన్ల విషయంలో టేస్ట్‌ ఎప్పటికప్పుడు మారుతున్నట్లే.. ఇంటీరియర్‌లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. గతంలో చిన్న ఇల్లు ఉండాలనే ఆశలతో ఉన్నవారు కరోనా తర్వాతి నుంచి విశాలంగా ఉండే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలస్యమైనా సరే.. కాస్త స్పేస్‌ ఎక్కువ ఉన్న ఇళ్లనే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో

నగరం మధ్యలో ఇరుకు ఇళ్లలో ఉండేకంటే  శివారు ప్రాంతాలు, పచ్చదనం ఉండే ప్రాంతాలను ఇష్టపడుతున్నారు. అపార్ట్‌మెంట్లలో అయితే డబుల్, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని హౌసింగ్‌.కామ్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ ఇండెక్స్‌ ఫర్‌ ఆన్‌లైన్‌ సెర్చ్‌(ఐఆర్‌ఐఎస్‌) తెలిపింది.  

15 శాతం వృద్ధి
గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్‌ స్పేస్‌ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ పెరిగింది. త్రీ బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాలలో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement