
సినిమాకు ఒకప్పుడు హద్దులు ఉండేవి. ఏ ఇండస్ట్రీ మూవీస్ ఆయా రాష్ట్రాల్లో మాత్రమే ఆడేవి. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని భాషా హద్దులు లేకుండా పోయాయి. దీంతో సామాన్యుల నుంచి స్టార్స్ వరకు కొత్త మూవీస్ ఎప్పటికప్పుడు చూస్తున్నారు. వాటి గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అలా దిగ్గజ సచిన్ టెండుల్కర్‌కి కూడా ఈ మధ్య రిలీజైన ఓ తమిళ సినిమా నచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.
(ఇదీ చదవండి: లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్ ఆక్రోశం)
రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సచిన్.. రీసెంట్‌గా రెడిట్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా సినిమాల గురించి అడగ్గా.. ఈ మధ్య కాలంలో తనకు 3 బీహెచ్‌కే, అత తంబైచ నాయ్ అనే చిత్రాలు నచ్చాయని చెప్పుకొచ్చారు. వీటిలో ఒకటి తమిళ్ కాగా, మరొకటి మరాఠీ మూవీ. 3 బీహెచ్‌కే సినిమా విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన సిద్ధార్థ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
మధ్య తరగతి కుటుంబం.. సొంత ఇంటి కలని నిజం చేసుకునే క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? చివరకు సొంత ఇల్లు కట్టుకోగలిగారా లేదా అనే స్టోరీతో తీసిన ఈ చిత్రం.. చాలామంది మిడిల్ క్లాస్ యువతకు కనెక్ట్ అయింది. శ్రీ గణేశ్ దీనికి దర్శకుడు. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు సచిన్ కూడా ఈ మూవీ తనకు నచ్చిందని చెప్పడంతో సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది.
(ఇదీ చదవండి: రజనీకాంత్ సలహా.. ఆ పని ఎప్పటికీ చేయను: కార్తీ)
