
కొందరు హీరోలు.. కేవలం నటన అనే కాకుండా మిగతా విభాగాల్లోనూ తమ ప్రతిభ చూపిస్తుంటారు. హీరోగా చేస్తూనే నిర్మాణం, దర్శకత్వం, ఎడిటింగ్.. ఇలా పలు డిపార్ట్‌మెంట్స్ హ్యాండిల్ చేస్తుంటారు. కొందరు మాత్రం యాక్టింగ్ తప్పితే మరో పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. అయితే వాళ్ల కారణాలు వాళ్లకు ఉంటాయి. ఇప్పుడు తమిళ హీరో కార్తీ కూడా అలాంటి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. రజనీకాంత్ తనకు ఇచ్చిన సలహా గురించి కూడా చెప్పుకొచ్చాడు.
తమిళ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్.. గత కొన్నాళ్లుగా భార్య ఆర్తితో విడాకులు, కుటుంబ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఆ గొడవ అంతా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలోనే రవి మోహన్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. రవి మోహన్ స్టూడియోస్ పేరుతో సంస్థని ప్రారంభించాడు. చెన్నైలో ఈ రోజు(ఆగస్టు 26) రెండు కొత్త చిత్రాలతో ఈ సంస్థ ప్రారంభమైంది.
(ఇదీ చదవండి: రష్మిక 'గర్ల్ ఫ్రెండ్'.. మెలోడీ సాంగ్ రిలీజ్)
ఈ వేడుకకు తమిళ హీరోలైన కార్తీ, శివకార్తికేయన్, ఎస్జే సూర్యతో పాటు పలువురు దర్శకనిర్మాతలు కూడా వచ్చారు. ఇందులోనే మాట్లాడిన కార్తీ.. తాను ఎప్పటికీ నిర్మాణ రంగంలోకి రానని తేల్చి చెప్పాడు. ఈ విషయమై రజనీకాంత్ తనకు ఎప్పుడో సలహా ఇచ్చారని అన్నాడు. చాన్నాళ్ల క్రితం రవి.. తనకు ఓ స్టోరీ చెప్పాడని, అందులో తాను-రవి హీరోలు ఉంటామని చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్ చెబుతున్న టైంలోనే నటిస్తూ నెరేషన్ ఇవ్వడం చాలా నచ్చేసిందని కార్తీ చెప్పాడు. కార్తి-జయం రవి.. గతంలో 'పొన్నియిన్ సెల్వన్' రెండు చిత్రాల్లో కలిసి నటించారు.
నిర్మాతగా అసలు ఎప్పటికీ మారనని కార్తి చెప్పాడు కదా.. అయితే ఇతడి అన్నయ్య సూర్య మాత్రం ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాతగా హిట్స్ కొడుతుండటం విశేషం. మరి కార్తీ ఎందుకు వద్దనుకుంటున్నాడో ఏమో?
(ఇదీ చదవండి: లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్ ఆక్రోశం)
I am always scared of producing movies, and I strongly go by the advice of #SuperstarRajinikanth sir not to enter production - #Karthi
pic.twitter.com/HYGseiV2SK— Trendswood (@Trendswoodcom) August 26, 2025