బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా లీడ్ రోల్‌లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’. ఫ్రాంక్ ఇ.ఫ్లవర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రజ్ కోర్డోవా సఫియా ఓక్లీ–గ్రీన్, టెమ్యూరా మారిసన్ ఇతర పాత్రలు పోషించారు. ఏజీబీవో, సినీస్టార్ పిక్చర్స్, బిగ్ ఇండీ పిక్చర్స్, పర్పుల్ పెబుల్ పిక్చర్స్‌పై జో రుస్సో,ఆంటోనీ రుస్సో, ఏంజెలా రుస్సో–ఓట్సా్టట్, మైఖేల్ డిస్కో, ప్రియాంకా చోప్రా, సిలీ సల్దానా, మరియల్ సల్దానా నిర్మించారు.
ప్రియాంకా చోప్రా పవర్ ఫుల్ పాత్ర పోషించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ టీజర్‌ని సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్‌ను ప్రియాంకా చోప్రా షేర్ చేశారు. ఇదిలా ఉంటే... లాస్‌ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్టన్ వేదికగా 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకి భర్త నిక్ జోనస్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


