హీరో ప్రభాస్ ఫుల్ బిజీ బిజీ కాబోతున్నారు. ఆయన హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. 2024 జూన్ 27న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని ఫిబ్రవరి నుంచి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట నాగ్ అశ్విన్. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు ప్రభాస్. వచ్చే నెలలో ఆయన ఇండియాకు తిరిగి వచ్చినవెంటనే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణలో పాల్గొంటారు.
ఈ షెడ్యూల్‌లో కమల్‌హాసన్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటుగా ‘ఫౌజి’, ‘స్పిరిట్’ చిత్రాలు కూడా చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాల చిత్రీకరణలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలనుకుంటున్నారట. ఇలా బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వరుస సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాకు మూడు రోజుల్లోనే రూ.183 కోట్లు వచ్చాయని చిత్రయూనిట్ పేర్కొంది.


