
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ముంబై బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు.
ఓజీ ట్రైలర్ను సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓజీ పోస్టర్ను ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా 1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మిచారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.
భారీగా టికెట్ ధరల పెంపు..
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్‌పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
#OGTrailer on Sept 21st.. pic.twitter.com/2RMr9r1dm5
— Sujeeth (@Sujeethsign) September 18, 2025