బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ లేటెస్ట్ మూవీ '120 బహదూర్'. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా లీడ్ రోల్స్ చేశారు. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)
మన దేశానికి చెందిన 120 మంది సైనికులు.. ఏకంగా 3000 మంది చైనా సైన్యంతో ఎలా పోరాడారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనేది '120 బహదూర్' మూవీ స్టోరీ. ట్రైలర్ చూస్తుంటే ఇదివరకే వచ్చిన వార్ బ్యాక్ డ్రాప్ మూవీలా ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరించేలా ఉన్నాయి.
(ఇదీ చదవండి: తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్)


