
మెగాస్టార్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న చిరంజీవి 70వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ స్టాలిన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.
మరోవైపు ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్ వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడితోనూ చిరంజీవి జతకట్టారు. పుట్టినరోజు ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Power. Rage. Madness. 💥#Stalin4K Re Release Trailer OUT NOW 🔥
▶️https://t.co/so8S9I4W91#StalinOn22Aug #StalinReRelease pic.twitter.com/LDdBimikIj— Anjana Productions (@Anjana_Prod) August 19, 2025