
చిత్రం శ్రీను , సుష్మ , రామ్ బండారు హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం మేఘన. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు సుధాకర రెడ్డి వర్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ శివ సాయి ఫిలిమ్స్ బ్యానర్‌పై నంది వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్‌తో టీజర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఈ సినిమా హీరో చిత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ..'మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది. నా ఖాతాలో మరో హిట్ పడుతుందని నమ్మకం ఉందియ నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు. హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ.. 'ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సహకరించారు. ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్న చనిపోయి మూడేళ్లు అవుతోంది. ఆ తర్వాత నేను ఎప్పుడూ బర్త్‌డే సెలబ్రేట్ చేయలేదు. కానీ ఈ సినిమా ప్రెస్‌మీట్ సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ మూవీ నా జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురాబోతుంది' అని అన్నారు.
దర్శకుడు సుధాకర రెడ్డి వర్ర మాట్లాడుతూ.. 'చిన్న ప్రొడక్షన్ అయినా పెద్ద కలలతో ఈ సినిమా చేశాం. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, కేవలం రెండేళ్లలోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. కథలో మానవ సంబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెంకట్ రమణ, మౌనిక , సౌమ్య , మల్లేశ్వరి ,,యం.నగేష్ బాబు , రోశిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డ్రమ్స్ రాము సంగీతమందిస్తున్నారు.