 
													త్రినాధ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'ఇట్లు మీ ఎదవ'. ఈ మూవీని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ హీరోయిన్గా నటిస్తున్నారు. వెయేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ వేడుకలో విడుదల చేశారు. ఈ సినిమాను సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ యూత్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ కీలక పాత్రల్లో నటించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
