
చిన్న సినిమాగా రిలీజై రీసెంట్‌గా కన్నడలో 'సు ఫ్రమ్ సో'.. బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకుంటోంది. దీన్ని ఇప్పుడు తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ శుక్రవారమే రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్నీగా ఉంటూనే ఈ హారర్ సినిమా ఆసక్తి కలిగిస్తోంది.
(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)
'సు ఫ్రమ్ సో' విలేజ్ బ్యాక్‌డ్రాప్ హారర్ కామెడీ మూవీ. అసలు విషయానికొస్తే.. తీర ప్రాంతంలో ఉండే ఓ ఊరిలో అశోక్ అనే కుర్రాడు ఆవారాగా తిరుగుతుంటాడు. అతడిని సులోచన అనే దెయ్యం ఆవహించిందనే పుకార్లు ఊరంతటా వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊరిలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వీటన్నింటికీ కారణమేంటి? సులోచన దెయ్యం నిజమేనా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. దర్శకత్వం కూడా వహించాడు. స్టోరీ కూడా అతడిదే. ప్రముఖ కన్నడ హీరో కమ్ దర్శకుడు రాజ్ బి శెట్టి.. ఓ నిర్మాతగా వ్యవహరించాడు. కన్నడలో హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: హీరోకి మెల్లకన్ను ఉంటే.. 'శ్రీ చిదంబరం' గ్లింప్స్ రిలీజ్)