హీరోకి మెల్లకన్ను ఉంటే.. 'శ్రీ చిదంబరం' గ్లింప్స్‌ రిలీజ్ | Sri Chidambaram Movie Telugu Glimpse | Sakshi
Sakshi News home page

Sri Chidambaram: 'శ్రీ చిదంబరం' సినిమా గ్లింప్స్‌ రిలీజ్

Aug 4 2025 4:23 PM | Updated on Aug 4 2025 4:32 PM

Sri Chidambaram Movie Telugu Glimpse

కిరణ్‌ అబ్బవరం 'క' చిత్రాన్ని నిర్మించిన మేకర్స్‌.. మరో డిఫరెంట్‌ మూవీతో రాబోతున్నారు. శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం 'శ్రీ చిదంబరం'. వినయ్‌ రత్నం దర్శకుడు.  వంశి తుమ్మల, సంధ్య వశిష్ట హీరో, హీరోయిన్. టైటిల్‌ గ్లింప్స్‌ని సోమవారం రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: నా తలపై జుట్టు ఊడిపోయింది.. నాగార్జున మాత్రం: రజనీకాంత్)

యంగ్‌స్టర్స్‌ కలిసి చేసిన ఫ్రెష్‌ ఫీల్‌ సినిమా ఇది. మెల్లకన్ను ఉన్న యువకుడు ఇన్‌సెక్యూర్‌తో కళ్ళద్డాలు పెట్టుకుని లైఫ్‌ని మేనేజ్‌ చేస్తుంటాడు. అలాంటి అబ్బాయి ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనే ఓ ఫన్‌ డ్రామా చుట్టు జరిగే కథ ఇది. బ్యూటిఫుల్‌ విలేజ్‌ డ్రామాగా తీస్తున్నారు. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. చిత్రంలో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చే చిత్రమిది అని నిర్మాత చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement