
ఐశ్వరి థాకరే హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం నిశాంచి. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీని జార్ పిక్చర్స్ బ్యానర్‌పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథ అందించారు.
ట్రైలర్ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2000వ దశకంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య థాకరే కవలలుగా ద్విపాత్రాభినయం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు.