
అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి ఓ సినిమానే 'అర్జున్ చక్రవర్తి'. కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే మరోవారంలో థియేటర్లలోకి మూవీ రానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.
(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)
విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని కబడ్డీ నేపథ్య నిజజీవిత కథతో తెరకెక్కించారు. విక్రాంత్ రుద్ర దర్శకుడు. 'ఖాళీ చేతులతో, కాలే కడుపుతో చేసేదే అసలైన యుద్ధం' అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. జాతీయ స్థాయిలో కబడ్డీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి.. తర్వాత కాలంలో తాగుబోతుగా ఎందుకు మారాల్సి వచ్చింది. దీనికి దారితీసిన పరిస్థితులేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఈ నెల 29న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నారు.
(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)