
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే పరమ్ సుందరిగా మెప్పించిన ముద్దుగుమ్మ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా జాన్వీ కపూర్ మరో మూవీలో కనిపించనుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న హోమ్ బౌండ్లోనూ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌గా వ్యవహిరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.
హౌమ్ బౌండ్ కథేంటంటే..
నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరిద్దరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.