
అనసూయ ( Anasuya Bharadwaj), సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నోబడి అనే ఉపశీర్షిక. ఈ మూవీకి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మనిషిలోని ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమాకు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇచ్చట అందరి కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతోంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కథ అంతా ఓ లైబ్రరీ చుట్టే తిరుగనుందని అనిపిస్తోంది. ట్రైలర్లో సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కామం అనే పదం చుట్టే హైలెట్ కావడంతో ఆ కోణంలోనే కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సురభి ప్రభావతి, వినోద్ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.