ధన్య బాలకృష్ణన్‌ కొత్త సినిమా.. ట్రైలర్ చూశారా? | Krishna Leela Trailer: Devan’s Mythological Love Story Impresses Fans | Sakshi
Sakshi News home page

ధన్య బాలకృష్ణన్‌ కొత్త సినిమా.. ట్రైలర్ చూశారా?

Oct 27 2025 2:30 PM | Updated on Oct 27 2025 3:15 PM

Dhanya Balakrishnan Latest Movie krishna leela trailer out now

దేవన్, ధన్య బాలకృష్ణన్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం కృష్ణ లీలా . దేవన్ స్వీయ దర్శకత్వంలో  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  తిరిగొచ్చిన కాలం.. అనేది ఈ మూవీకి ట్యాగ్‌లైన్‌.  ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్‌లో  జ్యోత్స్న  నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్.

కృష్ణలీల ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని లవ్‌ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ ప్రేమకథా చిత్రానికి మైథలాజికల్‌ టచ్‌ ఇచ్చినట్లు అర్థమవుతోంది. తన ప్రేమ కోసం హీరో చేసిన ప్రయత్నాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కోర్టుకు వచ్చాడా? ఎవరీ క్రేజీ మ్యాన్‌ అనే డైలాగ్‌ ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే , తులసి, 7ఆర్ట్ సరయు , ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement