
ఈ వారం సినీ ప్రియులను అలరించేందుకు మరో ఆసక్తికర మూవీ రానుంది. మలయాళ చిత్రం కొత్త లోక తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఫాంటసీ థ్రిల్లర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఈ ఫాంటసీ థ్రిల్లర్లో కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతమందించారు.