ఓటీటీల్లో ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉండొచ్చు. కానీ ఎక్కువమంది చూసేది మాత్రం థ్రిల్లర్ జానరే. మర్డర్ మిస్టరీ, మిస్టరీ థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్.. ఇలా పలు భాషల్లో బోలెడన్ని చిత్రాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అలా నేరుగా ఓటీటీలోనే ఓ తెలుగు డబ్బింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ కాన్సెప్ట్ ఏంటనేది రివీల్ చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)
గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్'. మిథున్ దర్శకత్వం వహించాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఇది వచ్చే నెల 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఇదైతే థ్రిల్లింగ్‌గానే ఉంది. కానీ ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి?
ట్రైలర్ బట్టి చూస్తే.. స్టీఫెన్ జబ్‌రాజ్ అనే సైకో కిల్లర్ 6 నెలల్లో 9 మంది యువతులని చంపేస్తాడు. అది కూడా సినిమాలో ఛాన్స్ అని పిలిచి ఈ హత్యలు చేస్తాడు. కానీ ఊహించని విధంగా ఓ రోజు పోలీసుల దగ్గరకెళ్లి స్వయంగా ఇతడే లొంగిపోతాడు. పోలీసులు వెతకగా.. సదరు అమ్మాయిల వస్తువులు దొరుకుతాయి గానీ వాళ్ల బాడీలు మాత్రం ఎంతకీ కనిపించవు. స్టీఫెన్ నిజంగానే హత్యలు చేశాడా? ఇతడికి ఎవరైనా సాయం చేశారా?అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: మహేశ్‌తో సినిమా ఫ్లాప్.. తొలిసారి ఆ విషయం అర్థమైంది: రకుల్)


