బెల్లంకొండ 'కిష్కింధపురి' ట్రైలర్ రిలీజ్ | Bellamkonda Srinivas, Anupama Parameswaran’s Horror Thriller Kishkindhapuri Trailer Out | Sakshi
Sakshi News home page

Kishkindhapuri Trailer: హారర్ 'కిష్కింధపురి'.. ట్రైలర్ చూశారా?

Sep 3 2025 11:30 AM | Updated on Sep 3 2025 11:47 AM

Bellamkonda Sreenivas Kishkindhapuri Movie Trailer

బెల్లంకొండ శ్రీనివాస్.. కొన్నాళ్ల క్రితం 'భైరవం' సినిమాతో వచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ తేలిపోయింది. ఇప్పుడు హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే 'కిష్కింధపురి'. సెప్టెంబరు 12న థియేటర్లలోకి సినిమా రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా కౌశిక్ పెగళ్ల దర్శకుడు.

(ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్‌టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?)

ట్రైలర్ బట్టి చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. దెయ్యాలపై ఆత్రుత ఉన్నవాళ్లందరినీ ఓ దెయ్యాల భవంతికి తీసుకెళ్లి, దాని వెనకున్న కథేంటి అని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఓ వాకింగ్ చేయిస్తారు. ఈ ప్రయాణంలో వీళ్లందరూ ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. పైట్స్ లాంటి కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ.. హైపర్ ఆది, సుదర్శన్ లాంటి వారిలో కామెడీ కూడా చేయించినట్లు ఉన్నారు. ట్రైలర్ చివర్లో అనుపమని దెయ్యంలా చూపించడం, దెయ్యాన్ని ఎదుర్కొనే శక్తిమంతుడిగా హీరోని చూపించడం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement