
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన లేటేస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టన్నెల్. ఈ చిత్రంలో అథర్వ మురళి హీరోగా నటించారు. ఈ సినిమాకు రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా టాలీవుడ్లోనూ రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అథర్వ ముపళి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12న తమిళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాలో అశ్విన్ కాకుమాను విలన్గా నటించారు. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని ఇప్పటికే యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు.