
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం హృదయపూర్వం. ఈ చిత్రంలో ది రాజాసాబ్ బ్యూటీ మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు.
ఈ నేపథ్యంలోనే హృదయపూర్వం ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంగీత, సిద్ధిక్, నిషాన్, బాబురాజ్, లాలూ అలెక్స్, జనార్దనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు.