రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ పలు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది. ఇప్పటికే కూలీ, జైలర్, బాహుబలితో పాటు కాంతార రికార్డ్‌ను సైతం బ్రేక్ చేసింది. కన్నడలో అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో కొనసాగుతోంది.
అయితే ఒకవైపు బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగిస్తుంటే.. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కాంతార చాప్టర్-1 థియేటర్లలో రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో ట్రైలర్ ఏంటని సినీ ప్రియులు పెద్ద డైలమాలో పడ్డారు. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యాక ట్రైలర్ ఏంటని తెగ చర్చించుకుంటున్నారు. దీపావళి ట్రైలర్ పేరుతో ప్రేక్షకులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు 12 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు మేకర్స్. దీంతో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులకు ఏదైనా బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నారేమో తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.
The divine roar continues to light up screens worldwide 💥#KantaraChapter1 Deepavali Trailer out Tomorrow at 12:07 PM.
Experience the ultimate cinematic celebration of Dharma.#BlockbusterKantara running successfully in cinemas near you! 🔥#KantaraInCinemasNow… pic.twitter.com/1R6xFJR2P9— Hombale Films (@hombalefilms) October 15, 2025


