
రోహన్, రిదా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "గప్ చుప్ గణేశా". ఈ సినిమాకు సూరి ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్‌పై కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... "ఈ చిత్రం టైటిల్ చాలా బాగుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. గతంలో కూడా కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్‌పై రిచ్చిగాడి పెళ్లి అనే చిత్రం హేమ్రాజ్ దర్శకత్వంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చిన్న సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్" అని అన్నారు.
చిత్ర నిర్మాత హేమ్రాజ్ మాట్లాడుతూ.. "మా చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంఛ్ చేసిన ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ సార్‌కు కృతజ్ఞతలు. ఆయన ఎంతో బిజీగా ఉన్న మా కోసం ఆయన సమయాన్ని కేటాయించి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినందుకు థాంక్స్" అన్నారు. దర్శకుడు సూరి ఎస్ మాట్లాడుతూ... "మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆయన సమయాన్ని కేటాయించి మాకు అండగా నిలబడిన ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ సార్‌కు మా చిత్ర బంధం తరఫున ధన్యవాదాలు" అన్నారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే... ఒక వ్యక్తి మొహమాటంతో తన ఉద్యోగాన్ని.. అలాగే తన జీవితంలోకి వచ్చిన ఉన్నత అధికారితో ఎలా మసులుకుంటాడు అనేది ఎంతో ఫన్నీగా ఉండనుందని అర్థమవుతోంది. అతని క్యారెక్టర్ చూస్తే ఎంతోమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా.. అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.