
ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. ఓ హిందీ మూవీని విడుదలకు సిద్ధం చేసింది. 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' పేరుతో తీసిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబరు 2న సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)
ట్రైలర్ బట్టి చూస్తే ఇదో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. సన్నీ(వరుణ్ ధావన్).. అనన్య (సన్య మల్హోత్రా)ని ప్రేమిస్తాడు. ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె ఇతడిని రిజెక్ట్ చేసి విక్రమ్(రోహిత్ షరాఫ్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. మరోవైపు విక్రమ్.. తన ప్రియురాలు తులసి(జాన్వీ కపూర్)కి బ్రేకప్ చెప్పేస్తాడు. దీంతో సన్నీ-తులసి కలిసి విక్రమ్-అనన్య పెళ్లికి వెళ్తారు. నానా హంగమా చేస్తారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్)