
తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ 'జానకి వర్సెస్ కేరళ'. లెక్క ప్రకారం జూన్ చివరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ టైటిల్‌పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం పెట్టింది. సీతాదేవి మరోపేరు జానకి అని, దీని వల్ల రిలీజ్ తర్వాత కాంట్రవర్సీ ఉండొచ్చని, అందుకే కచ్చితంగా పేరు మార్చాల్సిందే అని పట్టుబట్టింది. మూవీ టీమ్ తొలుత దీనికి అంగీకారం తెలపలేదు. ఎట్టకేలకు ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది.
(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న మెహర్ రమేష్)
జానకి వర్సెస్ కేరళ అని అనుకున్న టైటిల్‌ని సెన్సార్ బోర్ట్.. 'జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా మార్చింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. జూలై 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.
ట్రైలర్ బట్టి చూస్తే.. సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఈమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకకి న్యాయం దక్కిందా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి ఈ కోర్ట్ రూమ్ డ్రామా, ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)