
ఫహాద్ ఫాజిల్ పేరు చెప్పగానే క్రేజీ సినిమాలు, డిఫరెంట్ పాత్రలు గుర్తొస్తాయి. 'పుష్ప 2' సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇతడు.. ప్రస్తుతం తమిళంలో 'మారీషన్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో సీనియర్ కమెడియన్ వడివేలు కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. ఇంతకీ మూవీ సంగతేంటి?
(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న మెహర్ రమేష్)
ఇదో తమిళ సినిమా. దొంగతనాలు చేసిన ఒకడు(ఫహాద్).. డబ్బులతో ఉన్న మతిమరుపు వ్యక్తిని(వడివేలు) చూస్తాడు. అతడి దగ్గర నుంచి ఎలాగైనా సరే డబ్బు కొట్టేయాలని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి తిరువణ్ణామలైకి బైక్‌పై వెళ్తారు. మరోవైపు మతిమరుపు వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతుంటారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తోంది.
జూలై 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. చూస్తుంటే ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ చిత్రం చేశాడని అర్థమైంది. ప్రస్తుతానికైతే తమిళ వెర్షన్ మాత్రమే బిగ్ స్క్రీన్‌పైకి రానుంది. తెలుగు డబ్బింగ్ కోసం ఓటీటీలోకి వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదు. గతంలో ఫహాద్-వడివేలు కలిసి 'మామన్నన్' మూవీ చేశారు. ఇప్పుడు మరోసారి హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో?
(ఇదీ చదవండి: తెలుగు సినిమాలో వేశ్య పాత్రలో కాయదు?)