
ఒక్క సినిమా సక్సెస్‌తో ఓవర్ నైట్ అయిపోయిన హీరోయిన్లు చాలామంది ఉంటారు. రీసెంట్ టైంలో అలా 'డ్రాగన్' అనే తమిళ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాయదు లోహర్. ఈ చిత్ర విజయంతో ఈమెకు అటు తమిళం, ఇటు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వీటితో పాటు ఇప్పుడు మరో క్రేజీ పాత్ర ఈమెని వరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటది? ఎవరా హీరో?
అసోంకి చెందిన కాయదు లోహర్.. తెలుగులో ఇదివరకే 'అల్లూరి' అనే సినిమా చేసింది. కానీ ఇది ఫ్లాప్ అయ్యేసరికి తమిళంలో ప్రయత్నించింది. అక్కడ ఫేమ్ తెచ్చుకుంది. అలా మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ 'ఫంకీ'లో ఈమె హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పుడు నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్యారడైజ్'లోనూ కాయదునే హీరోయిన్ అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న మెహర్ రమేష్)
అనౌన్స్‌మెంట్ వీడియోతోనే అటెన్షన్ సొంతం చేసుకున్న 'ప్యారడైజ్'లో నాని.. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. రాఘవ్ జూయల్ అనే హిందీ నటుడు ఇందులో విలన్ అని రీసెంట్‌గానే ప్రకటించారు. మోహన్ బాబు, బాబు మోహన్ కూడా విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారని లీక్స్ వచ్చాయి. ఇప్పుడు నానికి జోడిగా వేశ్య పాత్రలో కాయదు లోహర్ కనిపించబోతుందని అంటున్నారు.
సాధారణంగా వేశ్య పాత్రలు అనగానే హీరోయిన్లు కాస్త వెనకడుగు వేస్తారు. కానీ కాయదు లోహర్ మాత్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈమెకు నానికి మధ్య బోల్డ్ సీన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమై, కాయదు రోల్ ఆకట్టుకుంటే మాత్రం ఈమె దశ తిరిగిపోవడం గ్యారంటీ. మరి వీటిపై ఓ క్లారిటీ వస్తే తప్ప ఏం మాట్లాడలేం.
(ఇదీ చదవండి: కారణం లేకుండా విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారు: నాగవంశీ)