ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ మూవీ క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రావడంతో వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఈ మూవీతో చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడింది.
తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని నార్త్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హిందీలో డబ్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందీ ట్రైలర్ విడుదల చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శంబాల టీమ్‌కు రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ జనవరి 09న బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.
కాగా.. ఈ చిత్రంలో అర్చన్ అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
After a grand successful Telugu release. #Shambala releasing in Hindi on 9th Jan’26
Unveiling the Hindi trailer - https://t.co/S1IUlDRVJz
All the best to @iamaadisaikumar and the entire team😊@tweets_archana @ugandharmuni #RajasekharAnnabhimoju @ShiningPictures… pic.twitter.com/itnt68GNa2— Rishab Shetty (@shetty_rishab) January 4, 2026


