
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada). ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఈనెల 12 వైజాగ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ట్రైలర్ రిలీజ్ తేదీపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని పోస్టర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 13న ఉదయం 11 గంటల 34 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సిద్ధు ఫ్యాన్స్ కాస్తా డిస్సాపాయింట్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
UNAPOLOGETICALLY RADICAL 💥💥#TelusuKadaTrailer out tomorrow at 11.34 AM.
Love will be unhinged ❤🔥#LoveU2#TelusuKada in cinemas worldwide from October 17th!
STAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @harshachemudu @vishwaprasadtg… pic.twitter.com/EwAIC1yWyI— People Media Factory (@peoplemediafcy) October 12, 2025