షాహిద్ కపూర్ హీరోగా వస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఓ రోమియో. ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ హిందీలో కాకుండా ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేయడం విశేషం. ఈ చిత్రంలో అవినాష్ తివారి, విక్రాంత్ మస్సే, నానా పటేకర్, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


