రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్‌ను ఈనెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.
IT’S TIME!! 💥
Get ready to witness Sagar’s Life Story soon.
BIOPIC OF A FAN - #AndhraKingTalukaTrailer arrives on 18th November ❤️🔥#Andhrakingtaluka pic.twitter.com/ih8HqokJ7H— RAm POthineni (@ramsayz) November 16, 2025


