
'మై విలేజ్ షో' పేరుతో యూట్యూబ్‌లో గుర్తింపు తెచ్చుకున్న టీమ్.. ఇప్పుడు సినీ అరంగేట్రానికి సిద్ధమైంది. అయితే థియేటర్‌లో కాకుండా ఓటీటీలో సందడి చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ వివరాల్ని కూడా వెల్లడించారు. ఇంతకీ ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ సోనియా సీమంతం వేడుక)
అనిల్, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ'. శివకృష్ణ దర్శకుడు. ఆగస్టు 8 నుంచి జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. గతంలో యూట్యూబ్‌లో 'విలేజ్ షో' టీమ్ అంతా ఎక్కువగా రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలనే తీశారు. ఇప్పుడు సిరీస్ కోసం ఆ తరహా కథనే ఎంచుకున్నారు.
పల్లెటూరిలో ఉంటే ఓ ఆకతాయి కుర్రాడు.. ఓ అమ్మాయితో లేచిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఎలాంటి తిప్పలు పడ్డాడు? చివరకు ఆ అమ్మాయితో ఒక్కటయ్యాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్, అందున రూరల్ స్టోరీతో తీసిన సిరీస్ కాబట్టి క్లిక్ కావొచ్చేమో చూడాలి?
(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ)