
బిగ్‌బాస్ షోతో నెగెటివిటీ, పాపులారిటీ ఒకేసారి సంపాదించింది సోనియా ఆకుల (Soniya Akula). పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీలతో ఆమె వ్యవహరించిన తీరు జనాలకు అంతగా నచ్చలేదు. దీంతో ఫినాలే వరకు రాకుండానే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే ఎంటర్‌ప్రెన్యూర్ యష్ వీరగోనిని ప్రేమిస్తున్నట్లు తెలిపింది.
ఏడాది తిరగకముందే గుడ్‌న్యూస్
షో నుంచి బయటకు వచ్చిన వెంటనే అతడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. గతేడాది డిసెంబర్‌లో యష్-సోనియా పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిరోజుల క్రితమే సోనియా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే తను తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. నేడు (జూలై 27న) ఆమె సీమంతం ఘనంగా జరిగింది.

సీమంతం ఫంక్షన్‌లో కీర్తి
ఈ వేడుకకు బుల్లితెర నటి కీర్తి భట్, ఆమెకు కాబోయే భర్త విజయ్ కార్తికేయన్‌తో కలిసి వెళ్లింది. తల్లి కాబోతున్న సోనియాకు చీర బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కీర్తి.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అక్కాబావకు శుభాకాంక్షలు.. హ్యాపీ సీమంతం. మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. త్వరలో రాబోయే బుజ్జిపాప కోసం ఈ పిన్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని క్యాప్షన్ ఇచ్చింది.
రెండో పెళ్లి
ఇది చూసిన అభిమానులు వీరి ప్రేమాభిమానులు చూసి ముచ్చటపడిపోతున్నారు. కాగా యష్ వీరగోనికి గతంలో పెళ్లయింది. ఓ బాబు కూడా ఉన్నాడు. చాలాకాలం క్రితమే భార్యకు విడాకులిచ్చే ఒంటరిగా ఉంటున్నాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. జార్జ్ రెడ్డి, కరోనా వైరస్, ఆశా ఎన్‌కౌంటర్ చిత్రాల్లో నటించింది.
చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్