
శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ ఎక్కువగా దైవారాధానలోనే మునిగిపోతారు. ఆధ్యాత్మికబాటలో నడుస్తున్నానని చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా శ్రావణ ఉపవాసం చేస్తోంది. కానీ మాంసాహారం తింటోంది. అదేంటో మీరే చదివేయండి..
చంపడానికి ప్రయత్నాలు
సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తనుశ్రీ దత్తా ఇటీవల కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో షేర్ చేసింది. నటుడు నానాపటేకర్.. తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడంది. తన మనుషులతో రాత్రిపూట ఇంటి బయట శబ్దాలు చేస్తూ భయపెడుతున్నారంది. బాలీవుడ్ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లాగే తననూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఇంటర్వ్యూల కోసం ఆమెను చాలామంది సంప్రదించారు.
రోజంతా ఉపవాసం.. రాత్రవగానే..
దానికామె కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని పేర్కొంది. కట్ చేస్తే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రావణమాసం సందర్భంగా మటన్ తింటున్నట్లు తెలిపింది. కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్‌ను చూపిస్తూ.. రోజంతా తినకుండా ఉన్నానని, రాత్రి 7 గంటలకు మటన్ తిని ఉపవాసం పూర్తి చేశానంది. "ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి.

మటన్ వండుకుని తిన్నా
ఎందుకంటే ఆహారమే అసలైన మెడిసిన్. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్ వండుకుని డిన్నర్ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది" అని చెప్పుఒకచ్చింది.
అందుకే లావైపోతున్నావ్
శ్రావణంలో మటన్ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్ తినడమేంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి అయితే నువ్వు కొవ్వు ఎక్కువగా తింటున్నావు, అందుకే లావవుతున్నావు అని కామెంట్ చేశాడు. దానికి తనుశ్రీ స్పందిస్తూ.. ముందుగా నా శరీరం గురించి కామెంట్ చేసేందుకు నీకు ఎటువంటి అర్హత లేదు. రెండోది.. బక్కపల్చగా లేనేమోకానీ ఫిట్‌గానే ఉన్నాను. ఎటువంటి డ్రెస్ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్ చేయడం ఆపండి.
కొవ్వు మంచిదే!
ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకోరు. అయినా కాస్త కొవ్వు పదార్థాలు తిన్నంతమాత్రాన శరీరంలో కొవ్వు చేరదు. ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవడం వల్ల సన్నగా కూడా అవుతారు. మన శరీరం బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్ అవసరం అని చెప్పుకొచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో వీరభద్ర మూవీలో యాక్ట్ చేసింది.
చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య