
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జోడీగా నటించిన చిత్రం 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'. విపిన్ దర్శకత్వం వహించగా ఉమాదేవి కోట నిర్మించారు. ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మంచి విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఆస్ట్రేలియా ప్రజల్ని హడలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్)
నరేష్ అగస్త ఇదివరకే కొన్ని తెలుగు సినిమాల్లో హీరో, సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'లోనూ ఓ కథానాయకుడిగా చేశాడు. రీసెంట్ టైంలో ప్రేమకథలు కాస్త తక్కువగానే వస్తున్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)