తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా జంటగా వస్తోన్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. ఈ సినిమాకు ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. జయ జయ జయహే అనే మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఓం శాంతి శాంతి శాంతిః మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే భార్య, భర్తల మధ్య జరిగే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కామెడీ సీన్స్ అలరిస్తున్నాయి. భార్యపై భర్త డామినేషన్ చేయడం.. ఆ తర్వాత జరిగే సీన్స్ ఈ సినిమాపై ఆసక్తి మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.


