దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
రన్ టైమ్ ఎంతంటే?
బాహుబలి: ది ఎపిక్ మూవీ రన్‌టైమ్ 3 గంటల 40 నిమిషాలని నిర్మాత శోభు యార్లగడ్డ ఇటీవలే వెల్లడించారు. బాహుబలి 1 ముగిశాక ఇంటర్వెల్.. ఆ తర్వాత ‘బాహుబలి 2 ఉంటుందని తెలిపారు. దాన వీర శూర కర్ణ (3 గంటల 46 నిమిషాలు) తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలి: ది ఎపిక్ చేరనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ సర్‌ప్రైజ్ కూడా ఉంటుందని తెలిపారు. బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది చివరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ రావొచ్చని కూడా తెలిపారు.
Two Films, One Epic Experience!
Here's the Release Trailer of @ssrajamouli's #BaahubaliTheEpic.
Telugu https://t.co/2vVWqhKDVU
Hindi https://t.co/xgsE1i0CBG
In Cinemas worldwide from 31st October 2025. #BaahubaliTheEpicOn31stOct #Prabhas @RanaDaggubati @MsAnushkaShetty… pic.twitter.com/VqlURRhbpg— Baahubali (@BaahubaliMovie) October 24, 2025


