ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. తర్వాత మూవీస్ అయితే తీశాడు గానీ ఒక్కటంటే ఒక్క హిట్ లేక దాదాపు కనుమరుగైపోయాడు. గతేడాది 'తిరగబడరా సామీ' అనే చిత్రంతో వచ్చాడు గానీ ఫలితం మారలేదు. ప్రస్తుతం 'చిరంజీవ' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
'జబర్దస్త్' ఫేమ్ అభి ఈ సినిమాకు దర్శకుడు. ట్రైలర్ బట్టి చూస్తే ఓ ప్రమాదంలో గాయపడ్డ హీరోకు.. ఎవరెన్ని ఏళ్లు బతుకుతారనే విషయం కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు వ్యక్తిగత సమస్యలు ఇతడిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? ఏంటనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ ఆకట్టుకుంటాడేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో విలన్‌గా క్రేజ్.. గుర్తుపట్టారా?)


