భారతీయ సినిమాల్లో పరాయి దేశ నటీనటులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. అయితే వాళ్లలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ఇతడు ఒకడు. చేసింది ఒక్కటే సౌత్ మూవీ అయినప్పటికీ. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇతడి ఫొటోలు వైరల్ అయ్యేసరికి సినీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఇతడెవరో గుర్తుపట్టారా?
(ఇదీ చదవండి: తెలుగు ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకి తమిళంలో హీరోయిన్ ఛాన్స్)
పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు జానీ ట్రింగ్యుయెన్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. డాంగ్లీ అని చెబితే ఇచ్చే కనిపెట్టేస్తారు. సూర్య హీరోగా చేసిన '7th సెన్స్' చిత్రంలో విలన్ ఇతడే. వియత్నాంలో పుట్టిన ఇతడు.. సొంత భాషతో పాటు హాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చేశాడు. మార్షల్ ఆర్ట్స్ గురువుగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2017 వరకు పలు భాషల్లో నటించాడు. తర్వాత మాత్రం యాక్టింగ్ పక్కనబెట్టేశాడు.
రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఇతడు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి.. డాంగ్లీ ఇంతలా మారిపోయాడేంటి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సూర్య సినిమా వచ్చి దాదాపు 14 ఏళ్లు అయిపోయింది. వయసు కూడా 50 ఏళ్లు దాటేసింది. దీంతో కాస్త వృద్ధాప్య ఛాయలు కూడా డాంగ్లీ ముఖంలో కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక్క సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడనే చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)



