ఆసక్తికరంగా విజయ్ ఆంటోని 'భద్రకాళి' ట్రైలర్ | Vijay Antony’s Political Action Thriller BhadraKaali Set for Sept 19 Release in Tamil & Telugu | Sakshi
Sakshi News home page

పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీతో 'భద్రకాళి'.. ట్రైలర్ రిలీజ్

Sep 10 2025 11:13 AM | Updated on Sep 10 2025 11:27 AM

Vijay Antony Bhadrakaali Trailer

తమిళ సంగీత దర్శకుడు కమ్ హీరో విజయ్ ఆంటోని వరసపెట్టి సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఈ ఏడాది ఇప్పటికే 'మార్గన్' అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌తో వచ్చాడు. ఇప్పడు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‍‌లో ఓ మూవీ చేశాడు. అదే 'భద్రకాళి'. లెక్క ప్రకారం సెప్టెంబరు 5నే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ 19వ తేదీకి వాయిదా పడింది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ)

ట్రైలర్ బట్టి చూస్తుంటే థ్రిల్లింగ్, పొలిటికల్‌ అంశాలు కనిపిస్తున్నాయి. సమాజంలోని దుష్టశక్తుల ఆటకట్టించే శక్తివంతమైన వ్యక్తిగా విజయ్‌ ఆంటోని పాత‍్ర ఉండనుందని అర్థమవుతోంది. ఈవారం 'మిరాయ్', 'కిష్కంధపురి' లాంటి తెలుగు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వచ్చే వారం రాబోతున్న 'భద్రకాళి'కి పెద్దగా పోటీ లేదు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement