
కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన యానిమేటెడ్ మూవీ 'మహావతార్ నరసింహా'.. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. కేవలం రూ.40 కోట్లు పెడితే రూ.300 కోట్ల పైగా కలెక్షన్ అందుకుని ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే యానిమేటెడ్ ట్రెండ్ మొదలైపోయింది. తెలుగులోనూ రీసెంట్‌గానే 'వాయుపుత్ర' అనే యానిమేటెడ్ మూవీ ప్రకటించారు.
(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)
ఇది సినిమాల వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోనూ 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. కొన్నిరోజుల క్రితం దీని స్ట్రీమింగ్ గురించి ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే 18 రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగిందో చూపించబోతున్నారని ట్రైలర్‌తో చూస్తే అర్థమైంది. కాకపోతే ట్రైలర్‌లో యానిమేషన్ ఏమంత గొప్పగా అనిపించలేదు.
అక్టోబరు 10 నుంచి ఈ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటితరానికి కురుక్షేత్రం గురించి పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం గురించి చాలామందికి తెలియదు. ఒకవేళ యానిమేషన్ అంతంత మాత్రంగా ఉన్నాసరే మేకర్స్.. కంటెంట్‌ని ఎంగేజింగ్‌గా చెప్పగలిగితే ఈ సిరీస్ హిట్ కావొచ్చు. చూడాలి మరి ఏం చేశారో?
(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్')