‘‘బాపుగారి సినిమాకి పని చేసే అవకాశం నాకు లేకుండా పోయింది. ‘ఇట్లు మీ ఎదవ’ కథ విన్నాక... ఈ సినిమాకి పని చేస్తే బాపుగారి చిత్రం మిస్ అయ్యాననే లోటు తీరుతుందనే అనుభూతి కలిగింది. ఈ చిత్రానికి టైటిల్ సూచించింది నేనే. కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది. ఈ మూవీ చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. యువత తమ తల్లిదండ్రులతో కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలిపారు.
త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. సాహితీ ఆవంచ హీరోయిన్‌గా నటించారు. సంజీవని ప్రొడక్షన్స్‌పై బళ్లారి శంకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు త్రినాథ్ కఠారి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి కథే హీరో. ఇది ఒక తండ్రీ కొడుకుల కథ, తండ్రీ కూతుళ్ల కథ, ఒక అమ్మాయి, అబ్బాయి కథ. ఈ సినిమా 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అని చెప్పారు. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బళ్లారి శంకర్. కెమెరామేన్ జగదీష్, డైరెక్టర్ తేజ మార్ని, నటీనటులు మధుమణి, రిషి, గోపరాజు రమణ, దేవీప్రసాద్, తాగుబోతు రమేశ్ తదితరులు మాట్లాడారు.
చదవండి: శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!


