
సత్యరాజ్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందించారు. ఈ చిత్రంలో ఉదయభాను ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ కథను డ్రగ్స్ మాఫియా కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఉదయభాను రోల్ చూస్తుంటే ఫుల్ అగ్రెసివ్గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో సత్యం రాజేశ్, వశిష్ఠ ఎన్.సింహ, సాంచి రాయ్, వీటీవీ గణేశ్, రాజేంద్రన్ కీలకపాత్రల్లో నటించారు.